బలహీన వర్గాలన్నీ బీజేపీవైపే
- కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎంల మధ్య చీకటి ఒప్పందం
- బీజేపీకి మేయర్‌గా అవకాశమిస్తేనే హైదరాబాద్ అభివృద్ధి
- బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు
హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో ప్రజ లు స్పష్టమైన మార్పు కోసం ఎదురుచూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే సంకల్పంతో మహిళలు, యువత ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ సుపరిపాలనపై విశ్వాసంతో ప్రతిరోజు పెద్ద ఎత్తున ప్రజలు బీజేపీలో చేరుతున్నార ని, ముఖ్యంగా బడుగు, బలహీనవర్గా ల ప్రజలు బీజేపీవైపు ఆశతో చూస్తున్నారని చెప్పారు.
తెలంగాణ రాజకీ యాల్లో మార్పు తీసుకురావడానికి ఇది సంకేతమని స్పష్టంచేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రము ఖ సంఘ సేవకులు, గౌడ సంఘం అధ్యక్షుడు, బీఆర్‌ఎస్ నాయకుడు పంజాల గి రిధర్‌గౌడ్ తమ మద్దతుదారులతో కలిసి రాంచందర్‌రావు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. టీడీపీ మాజీ కార్పొరేటర్ కుటుంబానికి చెందిన న్యాయవాది కవిత, పృధ్వీ రాజ్ తమ అనుచరులతో కలిసి కాషాయ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా రాంచందర్‌రావు వారికి పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవిత, గిరిధర్‌గౌడ్‌తోపాటు అనేక మంది యువకులు, మహిళలు బీజేపీలో చేరడం పార్టీపై పెరుగుతున్న విశ్వా సానికి నిదర్శనమని తెలిపారు. పార్టీలో చే రిన వారందరికీ స్వాగతం పలుకుతూ, ప్రజా సేవాధృక్పథంతో కలిసిపనిచేయాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ముఖ్యంగా జీహెచ్‌ఎంసీని అశాస్త్రీ యంగా మూడు భాగాలుగా విభజించిన కుట్ర వెనుక రాజకీయ లెక్కలు ఉన్నాయని విమర్శించారు.
హైదరాబాద్ నగర అభివృద్ధి నిజంగా జరగాలంటే బీజేపీకి అవకా శం ఇవ్వాలని, మేయర్‌గా బీజేపీ అభ్యర్థి ఉం టే నగరానికి పారదర్శక పరిపాలన, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి డాక్టర్ గౌతంరావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీకరెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ అధ్యక్షుడు లంకల దీపక్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి విఠల్ తదితరులు పాల్గొన్నారు.




