16 March, 2026 | 6:43 AM

రాజగోపాల్‌రెడ్డి డిన్నర్ మీటింగ్?

16-03-2026 01:30 AM
  1. 15 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం.. రహస్యంగా హాజరు!

క్యాబినెట్ విస్తరణపై అసంతృప్తితోనే సమావేశం?

రాజగోపాల్ బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారంటూ ప్రచారం

పెద్ద రాజకీయకుదుపునకు నాందా?

మునుగోడు, మార్చి 15 (విజయక్రాంతి): రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి  ఏ ర్పాటు చేసిన సీక్రెట్ డిన్నర్ మీటింగ్ కాం గ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. ఒకేసారి 15 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపినట్లు సమాచారం. రెండు మూడు రోజుల వ్యవధిలో మహబూబ్‌గర్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందగా మెజారిటీ ఎమ్మెల్యేలు రహస్యంగా హాజరైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కకుండా అడ్డుకుంటున్నారని భావిస్తూ, కొంత కాలంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నారనే సమా చారం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఈ డిన్నర్ మీటింగ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌లో కొంతమంది నేతలు చేరుతున్నారనే ప్రచారం సాగుతున్నది.

రాజగోపాల్‌రెడ్డి కూడా బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారంటూ వినిపించడం ఆసక్తికరంగా మారింది. ఇలాంటి సమయంలో ఈ సమావేశం కాంగ్రెస్‌కు మరో షాక్‌గా మారిం ది. ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు సంకేతమా? లేక పెద్ద రాజకీయ కుదుపుకి నాందా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.