రాకాలోకి ఎంట్రీ ఇస్తున్న హాలీవుడ్ విలన్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్(Atlee collaboration)లో తెరకెక్కుతున్న ‘రాకా’ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్, ఆస్కార్ విజేత(Oscar winner) విల్ స్మిత్ నటించనున్నారనే వార్తలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
అల్లు అర్జున్‌కు పోటీగా నిలిచే ప్రతినాయకుడి పాత్ర కోసం విల్ స్మిత్‌తో చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ పాత్ర కోసం ఆయనకు సుమారు రూ.80 కోట్ల వరకు పారితోషికం ఆఫర్ చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, ఇటీవల లీకైనట్లు ప్రచారం జరుగుతున్న బిహైండ్ ద సీన్స్ విజువల్స్, కాస్ట్యూమ్ డిజైన్‌కు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్‌కు తోడు విల్ స్మిత్ పేరు కూడా వినిపించడంతో ‘రాకా’పై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.