15 April, 2026 | 2:59 AM

భిక్కనూరులో అంబేద్కర్ జయంతి

15-04-2026 12:00 AM

భిక్కనూర్, ఏప్రిల్ 14:(విజయ క్రాంతి):  భిక్కనూర్ మండలంలోని పలు గ్రామాల్లో డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో అంబేద్కర్ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, కార్యదర్శులు, గ్రామస్తులు, నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

సదాశివనగర్‌లో..

సదాశివనగర్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామాలలో అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు ధర్మరావ్ పేట, పద్మాజీవాడి, ముడేగాం, కల్వరల్, లింగంపల్లి తదితర గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో, గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

బైక్ ర్యాలీ తీశారు.తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల మర్కల్ నందు ప్రిన్సిపల్ డాక్టర్ సి. శోభారాణి ఆధ్వర్యంలో శ్రీ బాబా సాహెబ్ డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ గ జయతోత్సవాలను  ఘనంగా నిర్వహించారు. అంబెడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.   కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్ లు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు,యువకులు పాల్గొన్నారు.