29 June, 2026 | 2:46 PM

రేపటి ఖమ్మం రైతు ఆశీర్వాద సభ రద్దు

29-06-2026 01:24 PM

హైదరాబాద్: తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పంపిణీ సదస్సును(Rythu Bharosa Distribution) హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించున్నారు. తొలుత మధిర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించినప్పటికీ వర్షాల కారణంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాల మేరకు శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా రైతులు, రైతు వేదికల నుంచి సమావేశంలో పాల్గొంటారు. రేపటి నుంచి 10 రోజుల్లో రైతుభరోసా అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.