4 August, 2026 | 2:49 AM

ఫిక్సింగ్‌కు పాల్పడిన అమెరికా క్రికెటర్

04-08-2026 01:11 AM

అఖిలేష్ రెడ్డిపై ఐసీసీ 8 ఏళ్ల నిషేధం

దుబాయి, ఆగస్టు 3 : మ్యాచ్ ఫిక్సింగ్ ను అరికట్టేందుకు ఐసీసీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏదో ఒక టోర్నీలో జరుగుతూనే ఉంటుంది. తాజాగా అమెరికా క్రికె టర్ అఖిలేష్ రెడ్డి ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. గత ఏడాది అబుదాబీ టీ10 లీగ్‌లో అవినీతికి పాల్పడినట్టు తేలింది. దీంతో ఐసీసీ అత డిని ఎనిమిదేళ్ల పాటు నిషేధించింది. ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్‌ను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకుంది. 2025 నవం బర్ 21వ తేదీన అతడిని తాత్కాలికంగా సస్పెండ్ చేయగా, ఇప్పుడు ఆ నిషేధాన్ని 8 ఏళ్లకు పొడిగించింది.

సహచర ఆటగాడిని ప్రలోభపెట్టే యత్నం చేసినట్టు అఖిలేష్‌పై ఆరోపణ లు వచ్చాయి. మ్యాచ్‌లో కావాలనే ఎక్కువ రన్స్ స మర్పించాలని అఖిలేష్ రె డ్డి తన తోటి ఆటగాడిని కోరాడు. అయితే అ తడు ఆ ప్రతిపాదనను తిరస్కరించి, వెంట నే ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్‌కు ఫి ర్యాదు చేశాడు. విచారణలో ముఖ్యమైన ఆ ధారాలను అతడు ఉద్దేశపూర్వకంగానే ధ్వం సం చేశారని ట్రిబ్యునల్ తేల్చింది. 26 ఏళ్ల అఖిలేష్ రెడ్డి.. నార్త్ అమెరికా టీ20 కప్ లో కేమన్ ఐలాండ్స్‌పై అమెరికా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు  4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.