4 August, 2026 | 2:46 AM

కామన్‌వెల్త్ గేమ్స్ పతాకం భారత్ చేతుల్లో

04-08-2026 01:10 AM

బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు 

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): కామన్‌వెల్త్ గేమ్స్ పతాకం ఇ ప్పుడు భారతదేశ చేతుల్లో ఉందని, అ హ్మదాబాద్‌లో జర గనున్న 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు అధికారిక కౌంట్‌డౌన్ ప్రా రంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఆయన సో మవారం ట్వీట్ చేశారు. అత్యున్నత ప్ర మాణాలతో ప్రపంచాన్ని ఆహ్వానిస్తూ, భారతదేశ క్రీడా పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ, దేశ క్రీడా చరిత్రలో చిరస్మరణీయ అధ్యాయాన్ని లిఖించడానికి మనమందరం కలిసి ముందుకు సాగుదామంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.