21 March, 2026 | 5:24 AM

కొండాపూర్ ఘటనపై విచారణ జరపాలి

21-03-2026 12:29 AM

నిర్మల్, మార్చి 20 (విజయక్రాంతి): నిర్మల్ మండలంలోని కొండాపూర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు బాలికల పట్ల వివరించిన తీరుపై సమగ్ర విచారణ జరపాలని ఎస్సీ ఎస్టీ హక్కుల జిల్లా అధ్యక్షులు గోవింద నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి భోజనాన్ని కలిసి ఘటన సంబంధించిన వివరాలను తెలిపి వినతి పత్రం అందించారు. పాఠశాలలో అక్రమాలు ఇతర ఆరోపణ లపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్, ఆదివాసీ నాయకుడు సీడం సంబు తదితరులు పాల్గొన్నారు.