8 June, 2026 | 6:38 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

సికందర్‌తో అందాల చందమామ!

14-09-2024 02:00 AM

ఏడాదిన్నర విరామం తర్వాత సల్మాన్ ఖాన్ ‘సికందర్’ చిత్రం ద్వారా మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. ఆయన కథానాయకుడిగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కు తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న ప్రధాన కథానాయిక కాగా, అందాల చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఈ ప్రాజెక్టులో చేరింది. అయితే, కాజల్ పాత్రకు సంబంధించిన వివరాలను మేకర్స్ గోప్యంగా ఉంచారు. తాను మూవీ షూటింగ్‌లో చేరిన విషయాన్ని మాత్రం కాజల్ స్వయంగా ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ గుర్తింపు కార్డును షేర్ చేసిందీ భామ. ‘సికందర్ డే1’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఉన్న ఈ ఐడీ కార్డ్ పోస్టుకు నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, రష్మిక మందన్నను ట్యాగ్ చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో తాజా సమాచారం ఏంటంటే.. ఇటీవల 200 మంది నేపథ్య నృత్యకారులతో ఓ పండుగ పాటను చిత్రీకరించారట. సల్మాన్ ధారవి లోని మురికివాడలను ప్రతిబింబించే సెట్‌లో ఈ సాంగ్ షూటింగ్ జరిగిందట. ముంబయి షూటింగ్ షెడ్యూల్ అక్టోబర్ వరకు జరగనుంది.

ఆ తర్వాత యూరప్‌లో రెండు రొమాంటిక్ సాంగ్ సీక్వెన్స్‌లు చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 45 రోజుల షూటింగ్ షెడ్యూల్ అనంతరం చిత్రబృందం హైదరాబాద్‌లోని ప్యాలెస్‌కు చేరుకుంటుందనేది బీటౌన్‌లో వినవస్తున్న మరో టాక్. సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం 2025 ఈద్ సందర్భంగా విడుదల కానుంది.