8 June, 2026 | 7:58 PM

Breaking News

మహర్రం సందర్భంగా భద్రత కల్పించాలని విజ్ఞప్తి   •   పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •  

మంచి రిలేషన్ ఉంటేనే ఇంటిమేట్ సీన్లలో నటించొచ్చు

15-09-2024 12:00 AM

కేరళ బ్యూటీ మాళవికా మోహనన్ ‘మాస్టర్’, ‘తంగలాన్’ వంటి చిత్రాలతో దక్షిణాది వారికి చేరువైంది. బాలీవుడ్ ప్రేక్షకుల అభిమానాన్ని సైతం పొందేందుకు సిద్ధమైందీ భామ. హిందీ చిత్రం ‘యుధ్రా’లో కథానాయికగా నటించటం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందీ సొగసరి. శ్రీధర్ రాఘవన్ కథ రాయగా, రవి ఉద్యావర్ ఈ సినిమాను యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. సిద్ధాంత్ చతుర్వేది హీరో. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఇందులో కథానాయకి మాళవిక పలు ఇంటిమేట్ సీన్స్, ముద్దు సన్నివేశాల్లో నటించింది.

‘యుధ్రా’లో నటించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పలు సందర్భాల్లో తెలిపింది. ఈ సినిమాలో సిద్ధాంత్ చిత్రీకరించిన ‘సాథియా’ పాట ఇటీవల విడుదలైంది. దీంట్లో హద్దుల్ని చెరిపేసి తన అందాలను ఆరబోసింది మాళవిక. ఆ సన్నివేశాలిప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే, ఇంటిమేట్స్ సీన్స్‌లో యాక్ట్ చేయడం అంత సులభం కాదంటూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందీ అమ్మడు. “ఏ సినిమా సెట్‌లోనైనా ఇంటిమేట్ సీన్స్ చిత్రీకరించేటప్పుడు ప్రత్యేకంగా ఇంటిమేట్ కో నియమిస్తున్నారు.

ఆ సన్నివేశాల్లో నటీనటులు ఇబ్బందిపడకుండా ఎలా నటించాలో చెప్పడానికే వారుంటారు. అది చాలా మంచి నిర్ణయం. అయితే, మా ‘యుధ్రా’ సెట్‌లో అలాంటి కో ఎవరూ లేరు. ‘సాథియా..’ పాట గురించి దర్శకుడు వివరించినప్పుడు సిద్ధాంత్, నేనూ మొదట కంగారు పడ్డాం. దీన్ని చేయగలమా? అన్న సందేహాన్ని వ్యక్తం చేశాం. సముద్ర తీరం కావటంతో చలి తీవ్రత తట్టుకోలేక.. ఏదో ఒక రకంగా దీన్ని పూర్తి చేసేయడమే మంచిదనిపించింది.. అందుకే డైరెక్టర్ చెప్పినవిధంగా చేసేశాం. కానీ ఇంటిమేట్, ముద్దు సీన్లలో నటించడం అంత సులభమైతే కాదు. నటీనటుల మధ్య మంచి అనుబంధం ఉండాలి. సౌకర్యవంతమైన వాతావరణమూ అవసరమే” అంటూ వివరించింది మాళవిక.