అంగన్వాడీల వేతనాల పెంపునకు కృషి

06-10-2026 | 03:03pm

కాగజ్‌నగర్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాల పెంపు కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు(Sirpur MLA Dr. Palvai Harish Babu) తెలిపారు. మంగళవారం మండలంలోని రాస్పల్లి గ్రామంలో నిర్వహించిన పోషణ మాసం, అంగన్ మిలన్ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ఎమ్మెల్యే సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం అంగన్వాడీ పిల్లలతో కలిసి ఎమ్మెల్యే అల్పాహారం స్వీకరించారు. కార్యక్రమంలో  డీడబ్ల్యూవో స్వరూప, సీడీపీవో రెబెకా, సూపర్‌వైజర్లు చందన, మాధవి, సర్పంచులు కుందారపు సుమన్, కోట వేణు, నాయకులు పుల్ల అశోక్, దోతుల శ్రీనివాస్, బాపురావు, పెరుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు