ట్రాఫిక్కు ఇబ్బంది కలిగిస్తున్న షాపింగ్ మాళ్లపై చర్యలు తీసుకోండి

06-10-2026 | 05:13pm

నిర్మల్ అక్టోబర్ 6 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న షాపింగ్ మాళ్ల వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రజలు ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్(Aam Aadmi Party District Convener Syed Haider) ఫిర్యాదు చేశారు.

కలెక్టర్ కార్యాలయంలో ఏవో కు వినతి పత్రం అందించారు. నిబంధనలకు విరుద్ధంగా షాపింగ్ మాల్ లను ఏర్పాటు చేయడం వల్ల ప్రతిరోజు ట్రాఫిక్ సమస్య దొంగతనాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉన్నారు

మరిన్ని వార్తలు