విద్యుత్ కోతలపై రైతుల ఆందోళన..
ఏఈతో సబ్ స్టేషన్ లో వాగ్వాదం..
రామాయంపేట అక్టోబర్ 6 (విజయక్రాంతి): తమకు విద్యుత్ సరిగ్గా రావడం లేదంటూ కోనాపూర్ సబ్ స్టేషన్ (Konapur Substation)పరిధిలోని గ్రామస్తులు మండిపడ్డారు మంగళవారం సబ్ స్టేషన్ కు చేరుకున్న రైతులు ఏఈ తిరుపతిరెడ్డి (AE Tirupati Reddy)తో వాగ్వాదానికి దిగారు తమకు ప్రభుత్వం ఇచ్చే తొమ్మిది గంటల విద్యుత్ లో కనీసం రెండు గంటలు కూడా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇచ్చే కరెంటు ఏదో నీరు గారడంలా ఇస్తే తమకు ఈ బాధలు తప్పవని పేర్కొన్నారు. ప్రతిరోజు విద్యుత్ వల్ల మోటార్లు కాలిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. తమకు నిరగడంగా విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. దీంతో ఏఈ తిరుపతిరెడ్డి రైతులకు నచ్చజెప్పి రెండు రోజుల్లో విద్యుత్ సక్రమంగా అందిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు సంజీవరెడ్డి. విద్యాసాగర్. బిక్షపతి. బీరయ్య. హరి కిషన్. తదితరున్నారు.