జాదవ్ చందుకు అజ్మీరా శ్యామ్ నాయక్ నివాళి

06-10-2026 | 05:01pm

లింగాపూర్ (విజయక్రాంతి): మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన జాదవ్ చందు పెద్దకర్మ కార్యక్రమానికి ఏఐబిఎస్ఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్(Ajmeera Shyam Naik) హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ సమాజ ఐక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, యువత విద్యాభివృద్ధిలో ముందుండి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. కష్టసుఖాల్లో సమాజంలోని ప్రతి కుటుంబానికి అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీందర్, ముండే దీపక్, రాథోడ్ రవీందర్, చౌహన్ గునవంత్ రావు, జాదవ్ రమేష్, రాథోడ్ బలిరామ్, ఆడే బాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు