తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ
దోమకొండ, అక్టోబర్ 6 (విజయక్రాంతి): దోమకొండ మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రక్షణ సేన కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నంగునూరి రవీధందర్ గుప్తా (బిఎ, ఎల్ఎల్బి) ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన కార్యక్రమాలు, లక్ష్యాలపై నాయకులు చర్చించారు. కార్యక్రమం అనంతరం నాయకులు, కార్యకర్తలు జెండాకు గౌరవం తెలిపారు. ఈ కార్యక్రమంలో రాగుల దేవేందర్ గౌడ్,దుంపటి రాకేష్, పెద్దపాటి నాగేంద్ర, బొడ్డు నరేష్ కుమార్, మైలారం పవన్, శివమునేష్, శ్రీయాంశ్, చరణ్, వరుణ్, శ్యామ్ రెడ్డి, చిన్నం సాయిరెడ్డి, ముత్యం గౌడ్, నర్సింలు, రాజు, జొన్నల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహిళా ప్రతినిధులు షేక్ సనా, దుంపటి లక్ష్మీనరసవ్వ, పుట్ట భారతి, పద్మ సుజాత, మైలారం శ్యామల, రామ లక్ష్మి పాల్గొన్నారు.