అంగన్వాడీ సేవలపై ప్రశంసలు
అంగన్వాడీ టీచర్లు, ఆయమ్మల సేవలు అభినందనీయం
జుక్కల్,(విజయక్రాంతి): మండలంలోని లాడేగాం గ్రామ ఎస్సీ వాడలోని అంగన్వాడీ(Anganwadi) కేంద్రం, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రంలో అంగన్ మిలన్ కార్యక్రమాన్ని(Angan Milan program) నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్య కోసం సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయమ్మలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా(Kamareddy District) బీజేపీ మహిళా మోర్చా కో-ఇన్చార్జి రాథోడ్ సునీత మాట్లాడుతూ.. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్యాభివృద్ధిలో అంగన్వాడీ టీచర్లు, ఆయమ్మలు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.
వారి సేవలను గుర్తించి సన్మానించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం అంగన్ మిలన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో పాటు గర్భిణీ స్త్రీలకు పండ్లను పంపిణీ చేశారు. చిన్నారులు, గర్భిణీల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలాజీ పటేల్, బుడాల గంగరాజు, సంబాజీ పటేల్‌తో పాటు గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.