calender_icon.png 10 October, 2025 | 9:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గో ప్రతిష్ఠ ఉద్యమం వార్షికోత్సవం

10-10-2025 01:31:04 AM

అవిముక్తేశ్వరానంద సరస్వతీ మహరాజ్ స్ఫూర్తితో, వేదిక్ గ్లోబల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహణ

గో ప్రతిష్ఠ పతాకాన్ని ఎగురవేసిన విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం 

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 9 (విజయక్రాంతి): పరమారాధ్య పరమధర్మాధీష్ ఉత్తరా మ్నాయ జ్యోతిష్‌పీఠాధీశ్వర్ జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీ 1008 అవిముక్తేశ్వరానంద సరస్వతీ మహరాజ్ స్ఫూర్తితో, ఆయన నాయకత్వంలో, వేదిక్ గ్లోబర్ ఆధ్వర్యంలో గో ప్రతిష్ఠ ఉద్యమం మొదటి వార్షికోత్సవం హైదరాబాద్‌లో గురువారం ఉద యం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం, ఎండీ విజయరాజం హాజరుకాగా.. తెలంగాణ రాష్ర్ట గో సంసద్ ప్రదేశ్ ఇన్‌చార్జ్ శ్రీ నరేంద్ర చతుర్వేది అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా శంకరాచార్య శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి మహారాజ్ బహూ కరించిన గో ప్రతిష్ఠ పతాకాన్ని (కొత్త జెండాను) సీఎల్ రాజం ఎగురవేశారు. ఈ ఉత్సవం లో రాష్ర్టవ్యాప్తంగా ఉన్న గో భక్తు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద మంత్రోచ్ఛారణలతో గోమాత పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగం గా కొత్తగా నియమితులైన గో పార్లమెంటు సభ్యు లు మహంత్ శ్రీ యోగిదాస్ (హైదరాబాద్), సిహెచ్ సూర్యప్రకాష్ రాజు (మల్కాజిగిరి), ఎ లక్ష్మణ్‌రెడ్డి (వరంగల్), జ్యోతి వైష్ణవి దేవి (సికింద్రాబాద్) గోవుల ను రక్షిస్తామని ప్రమాణం చేశారు.

గోవు రక్షణ, గో సేవ గురించి ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు మమతా చతుర్వేది, జాయింట్ సెక్రటరీ శివరామ్ ప్రసాద్, కోశాధికారి వినయ్ శర్మ, కార్యనిర్వాహక కమి టీ సభ్యులు గోకరణ్ చతుర్వేది (ఇండోర్), పవ న్ పాఠక్ (కట్ని), గో భక్తులు తారకేశ్ చతుర్వేది, చంద్రస్వామి పాల్గొన్నారు. అలాగే వివిధ జిల్లాల ప్రతినిధులు, సాధువులు, సామాజిక కార్యకర్తలు, గ్రామీణ ప్రాంతాల నుంచి గోవు భక్తులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.