10-10-2025 01:47:01 AM
ఆరు గ్యారెంటీల లాగానే 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామా ఆడుతున్నది. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల కోసం ఏనాడూ పాటుపడలేదు. మాయ మాటలు చెప్పి రా ష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. స్థానిక ఎన్నికల్లోనూ లబ్ధి పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయి. 22 నెలలు గా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన రేవంత్‌రెడ్డి, గల్లీలో కొట్లాడుతున్నట్టు డ్రామా క్రియేట్ చేశారు తప్ప, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ధి ప్రదర్శించలేదు.
రిజర్వేషన్ కల్పించేందుకు చట్టబద్ధత కోసం కేంద్రాన్ని పట్టుబ ట్టాల్సిన రేవంత్‌రెడ్డి, దాన్ని పక్క దోవ పట్టించారు. బీసీల పట్ల తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూ మంత్రం గా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెరతీశారు. కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42 శాతం పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడాలి. పార్లమెంట్‌లో చట్టం చేయించి, షెడ్యుల్ 9లో చేర్చాలి. పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయాలి. ఢిల్లీ వేదికగా యుద్ధభేరి మోగించాలి. బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ బీసీల కోసం గొంతెత్తుతుంది.
మాజీ మంత్రి హరీశ్‌రావు
బీసీల నోట్లో మట్టి కొట్టారు
బీసీల నోట్లో రేవంత్‌రెడ్డి ప్రభు త్వం మన్ను కొట్టిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాం గం మాకు పట్టదు అన్నట్లుగా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిం చింది. అందరినీ వేపచెట్టుకు కట్టివేసి కొట్టినా తప్పు లేదు. నమ్మి ఓట్లు వేసిన పాపానికి బీసీలను తడిగుడ్డతో కోస్తున్నారు. ఇచ్చినట్లే ఇచ్చి చట్టపరమైన లొసుగులు సృష్టించారు.
మంత్రులు ఎవరిని బెదిరించడానికి కోర్టులకు వెళ్లారు? ఇదేమైనా బల ప్రదర్శన. అడ్డమైన జీఓలు తీసుకొచ్చి బల ప్రదర్శన చేస్తామనడానికి రౌడీ రాజ్యమా. బిల్లులు రాష్ర్టపతి వద్ద పెండింగ్‌లో ఉండగా చిన్న పిల్లల తరహాలో మళ్లీ ఆర్డెన్సెన్స్‌లు, బిల్లులు తీసుకొచ్చారు. బీసీ మంత్రు లు, ఎమ్మెల్యేలకు మద్దతు లేదు. సీఎం నాటకాలు ఆడుతుంటే పాలాభిషేకాలు, పూలా భిషేకాలు చేశారు. కాంగ్రెస్ నేతలను ప్రజలను నిలదీయాలి. కులగణన నివేదికను ఎం దుకు బహిర్గతం చేయలేదు? ఎక్కడ దాచారు.
ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్
చెల్లని జీవో ఇచ్చిన ప్రభుత్వం
బీసీ రిజర్వేషన్లపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెల్లని జీవో ఇచ్చిందని మాజీ మంత్రి గంగుల కమాలకర్ విమర్శించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో హైకోర్టు తీర్పుపై మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీసీలను మోసం చేసింది. జీవో ద్వారా సాధ్యం కాదు, రాజ్యాంగ సవరణ జరిగితేనే ఫలితం ఉంటుందని చెప్పాం. బీహార్, మహారాష్ర్ట తప్పిదాలు చేయవద్దని కోరాం. అయినా 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని జీఓ తెచ్చారు.
బీసీలు ఏం చేస్తారులే అని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెల్లని జీవో ఇచ్చింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నికలకు తొందర లేదు, రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే నిర్వహించాలి. చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి ఢిల్లీకి కదలాలి. రిజర్వేషన్ల అంశం తేలేవరకు హైదరాబాద్ రావద్దు. 56 సార్లు సొంత పనుల కోసం సీఎం ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు బీసీల కోసం ఒక్కసారి ఢిల్లీ వెళ్లండి.
మాజీ మంత్రి గంగుల కమలాకర్
పదవులు కాపాడుకునేందుకు కాంగ్రెస్ నేతల స్టంట్స్
రాహుల్‌గాంధీని ఖుషీ చేసేందుకు, పదవులు కాపాడుకునేందుకు కాంగ్రెస్ నేతలు స్టంట్ చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. బీసీ బిల్లుపై రాష్ర్టపతిని కలవకుండానే ఢిల్లీలో ధర్నా చేసి హంగామా చేశారు. చట్టం ప్రక్రియ పూర్తి కాకముందే జీఓ ఎలా తెస్తారు? బీహార్‌లో ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ కోసం తెలంగాణలో బీసీలను బలి పెట్టి రోడ్లపైకి తీసుకొచ్చారు.
స్టే వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తూ వచ్చారు. హైకోర్టులో కేసు వేసింది కాంగ్రెస్ పార్టీ నేతలు కాదా? ఓసీ, బీసీల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారు. పిటిషన్లు వేసిన వారితో కనీసం మాట్లాడారా. కాంగ్రెస్‌లోని బీసీ నేతలు వాస్తవాలను గమనించాలి. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలి. ఈ అంశంపై మా పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తాం.
మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డెడ్ అనేలా కాంగ్రెస్ తీరు
ఆపరేషన్ సక్సెస్, పేషంట్ డెడ్ అనేలా కాంగ్రెస్ వ్యవహరించిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం ఉపయోగించుకున్నది. అమలు కాదని తెలిసి కూడా మోసపూరిత జీఓ తీసుకొచ్చి ఆగం చేశారు. బీసీల ఆగ్రహ జ్వాలలో కాంగ్రెస్ కూలిపోవడం ఖాయం. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిస్తే తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చడం సాధ్యమవుతుంది. బీసీలు అన్నీ గమనిస్తున్నారు, తగిన బుద్ధి చెపుతారు.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలతోనే స్టే
కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 9పై శాస్త్రీయ పద్ధతిలో కాకుండా తమకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం వల్లే హైకోర్టు స్టే ఇవ్వాల్సి వచ్చింది. బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పిన రేవంత్ సర్కార్ మాట తప్పి ఢిల్లీకి పోయి ధర్నాల పేరుతో నాటకాలు ఆడారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీ వేదికగా చేయాల్సిన పోరాటాలను గల్లీలో చేస్తూ బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కామారెడ్డి వేదికగా బిసి డిక్లరేషన్ అమలు విషయంలో అఖిలపక్షం సభ్యుల సూచనలను, సలహాలను పెడచెవిన పెట్టకుండా శాస్త్రీయబద్ధంగా రూపొందించాలి.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
డెడికేటెడ్ కమిషన్‌ను డుప్లికేట్ కమిషన్‌లా మార్చారు
బీఆర్‌ఎస్ పార్టీతో పాటు న్యాయ, రాజ్యాంగ నిపుణుల సూచనలను కుట్రబుధ్ధితో కావాలనే పెడచెవిన పెట్టిన రేవంత్‌రెడ్డి సర్కార్.. చివరికి చేతులు కాల్చుకోవడంతో పాటు బీసీలను సైతం ఎగతాళి చేసింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకు పరిష్కార మార్గం తెలిసినా, కావాలనే సీఎం రేవంత్‌రెడ్డి పక్కదారి పట్టించి అన్ని వర్గాలను వెక్కిరించే వెకిలి పనికి పూనుకున్నారు. డెడికేటెడ్ కమిషన్‌ను డుప్లికేట్ కమిషన్‌లా మార్చేసి రిపోర్ట్‌ల న్యాయబద్ధతను ప్రభుత్వమే దెబ్బతీసింది.
చివరికి చట్టాల్లో చెత్త నింపి, ఆర్డినెన్స్‌లో న్యూసెన్స్ నింపేసిన రేవంత్ సర్కార్ జీవోలో గోబెల్స్ గుణం బయటపడేసుకుంది. తమిళ నాడు తరహాలో అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసి కేంద్రం మెడలు వంచి తొమ్మిదో షెడ్యూల్‌లో రిజర్వేషన్లు చేర్పించే ప్రయత్నం చేయకుండా కావాలనే కాంగ్రెస్ సర్కార్ కుట్రపూరితంగా బీసీలపై బోగస్ తంతంగం నడిపి బోల్తా పడింది. రేవంత్‌రెడ్డి వంచన సర్కార్ చంద్రబాబు వస్త్రాలు ధరించి, మోదీ మాస్క్ వేసుకొని డ్రామాల దండోరాను నమ్మి నడుస్తున్నది. ఆలోచనపరులందరూ ఈ సర్కార్ సైకో సంస్కారాన్ని నిలదీయాలి.
ఆంజనేయగౌడ్, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్