calender_icon.png 10 October, 2025 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టులో నిలబడని జీవోతో మోసం

10-10-2025 01:28:11 AM

42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ర్ట ప్రభుత్వం ఇన్ని రోజులపాటు మోసపూరితంగా వ్యవహరించిన తీరు తేటతెల్లమైంది. రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ ఇంతకాలం చేసిందంతా డ్రామానే. చట్టం పరీక్షకు నిలవ కుండా వ్యవహరించిన తీరు వల్లనే బీసీలకు రిజర్వేషన్ దక్కకుండా పోయింది. సీఎం రేవంత్‌రెడ్డి బీసీలను మభ్యపెట్టేందుకు తె చ్చిన జీవో న్యాయస్థానాల్లో నిలబడదని బీఆర్‌ఎస్ చెప్పిన మాట అక్షరాలా నిజమని తేలిపోయింది.

కులగణన నుంచి మొదలుకొని ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తున్నది. అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లా ల్సింది పోయి, ఏకపక్షంగా దేశ రాజధానికి వెళ్లి ధర్నా పేరిట నాటకమాడారు. ఎన్నికలకి ముందు రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి 42 శాతం బీసీలకు పదవులు కట్టబెడతామని చె ప్పి మాట మార్చింది.

చివరికి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యాక రిజర్వేషన్లు సాధిస్తామని చెప్పారు. ఒకవైపు రాష్ర్టపతి వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండగానే ఆర్డినెన్స్ పేరిట కొంతకాలం హంగామా చేశారు. చివరికి న్యాయస్థానాల్లో నిలబడని జీఓతో మభ్యపెట్టారు. బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని తుంగలో తొక్కి, పార్టీ పరంగా ఇస్తామని ప్రతిపాదనలు తెరపైకి తెచ్చిన నాడే కాంగ్రెస్ మోసం బయటపడిపోయింది.

22 నెలల చేతకాని పాలనపై ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం, వ్యతిరే కతను చూసి సీఎం భయంతో వణికిపోతున్నారు. హామీలను నెరవేర్చడం చేతకాని ప్ర భుత్వం మరోవైపు తన అసమర్థ పరిపాలన విధానాలతో ఉన్న సంక్షేమ అభివృద్ధి పథకాలను కార్యక్రమాలను ఆపేసి తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నది.

అం దుకే స్థానిక ఎన్నికలను వివాదంగా మార్చి, ఏదో రకంగా వాయిదా వేయించేందుకు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పావుగా వాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన దగాకు తోడు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా బీసీ బిల్లులను పెండింగ్‌లో పెట్టి వెనుకబడిన వర్గాలను దారుణంగా వెన్నుపోటు పొ డిచింది. బీసీలను, గారడీ మాటల గ్యారెంటీ కార్డుతో ప్రజలను వంచించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు. 

 మాజీ మంత్రి, 

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్