టీఎంసీకి మరో షాక్
రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ చిక్ బరైక్ రాజీనామా
కోల్‌కతా, జూన్ 11 (విజయక్రాంతి): టీఎంసీ మరో రాజ్యసభ సభ్యుడు ఎంపీ ప్రకాష్ చిక్ బరైక్ రాజీనామా చేశారు. గురువారం ఆయన పార్టీ సభ్యత్వానికి కూడా రా జీనామా సమర్పించారు. దీంతో నాలుగురోజుల్లో 13 మంది రాజ్యసభ ఎంపీలలో ముగ్గురు టీఎంసీని వీడినట్లయ్యింది. జూన్ 8న సుఖేందు శేఖర్, జూన్ 10న సుష్మితా దేవ్‌లు రాజీనామా చేశారు. మరోవైపు అధినేత్రి మమతా బెనర్జీని పార్టీ కష్టాలు వీడడం లేదు. తాజాగా కళ్యాణ్ బెనర్జీ అభిషేక్ బెనర్జీపై తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశా రు.
సీఐడీ సోదాల కేసులో తనను తప్పిస్తున్నట్లు అర్థరాత్రి ఫోన్ చేయడాన్ని కళ్యాణ్ బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టారు. అభిషేక్ బెన ర్జీ వల్లే టీఎంసీ నాశనమైందని మండిపడ్డా రు. సీనియర్లను అభిషేక్ ఎపుడూ గౌరవించలేదన్నారు. తనను కేసు నుంచి తప్పించడం అవమానకచర్యగా అభివర్ణించారు. వెంటనే మమతా బెనర్జీ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అభిషే క్ బెనర్జీనా, కళ్యాణ్ బెనర్జీనా ఎంచుకోవాలని అల్టీమేటం జారీ చేశారు. మరోవైపు అభిషేక్ బెనర్జీ సీఐడీ ఎదుట హాజరుకావాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది.






