29 July, 2026 | 10:01 AM

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదు

29-07-2026 08:55 AM

బుగ్గారం ఎస్సై జి. సతీష్ 

ధర్మపురి,జూలై28(విజయక్రాంతి): ధర్మపురి సిఐ ఎ. రాంనర్సింహరెడ్డి ఆద్వర్యంలో బుగ్గారం ఎస్సై జి.సతీష్ తన సిబ్బందితో బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా మద్దునూరు గ్రామానికి చెందిన గజ్జెల మొండయ్య అనునతడు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో పట్టుబడడంతో బుగ్గారం పోలీసులు పరీక్ష చేసి ధర్మపురి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జానకి ముందు హాజరు పరచగా,  గజ్జెల మొండయ్య కి మూడు రోజుల జైలు  శిక్ష  విధించారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు జగిత్యాల సబ్ జైలు కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

ఈ సందర్బంగా జి. సతీష్ ఎస్సై  మాట్లాడుతూ రోడ్డుపైన ప్రయాణించే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచిస్తూ, మద్యం సేవించి వాహనం నడుపరాదని, సీట్ బెల్ట్ తప్పకుండ ధరించాలని, అతివేగం నివారించడం, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని, ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత పట్ల అవగాహన ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు.