పేకాట రాయుళ్ల అరెస్ట్
25,020 రూ నగదు,5 సెల్‌ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
సుల్తానాబాద్, జులై 28 (విజయక్రాంతి): విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూర్ గ్రామ శివారులోని రైల్వే ట్రాక్ పక్కన గల ఖాళీ ప్రదేశంలో కొందరు వ్యక్తులు మూడు పేకాట (టీన్ పట్టి) ఆడుతూ డబ్బులతో జూదం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో సుల్తానాబాద్ ఎస్ఐ చంద్రకుమార్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి దాడి నిర్వహించారు.
దాడిలో పూసల గ్రామానికి చెందినఅనిల్, రాకేష్, రాజు, శ్రీకాంత్ ,సాంబమూర్తిఅనే ఐదుగురు వ్యక్తులు మూడు ముక్కలాట ఆడుతూ నగదుతో జూదం నిర్వహిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.25, 020/- నగదు, 52 పేకముక్కలు, 5 మొబైల్ ఫోన్లు, 3 మోటార్ సైకిళ్లను మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసు కోవడం జరిగింది. నిందితులు ఐదుగురిపై తెలంగాణ గేమింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ రంజిత్ రావు మాట్లాడుతూ ఈ విధంగా ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లయితే పోలీసువారికి సమాచారo ఇవ్వాలని తెలిపారు.






