వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
మేడ్చల్, జూన్ 2(విజయ క్రాంతి): మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో, జాతీ య క్షయ నిర్మూలన కార్యక్రమం కింద ల్యా బ్ టెక్నీషియన్, సీనియర్ ట్యూబర్క్యులోసిస్ ల్యాబొరేటరీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి అ ర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని డిఎంహెచ్వో డాక్టర్ సి ఉమా గౌరీ తెలిపారు. ఈ నియామకాలు పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేపడుతున్నామని తెలిపారు.
5 ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలు ఉన్నాయని,ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు తో పాటు ఎన్‌టిఇపి స్పుటమ్ స్మియర్ మైక్రోస్కోపీ విభాగంలో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలన్నారు. ఉన్నత విద్యార్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. జోన్‌౪ స్థానికులు మాత్రమే దర ఖాస్తు చేసుకోవాలన్నారు. సీనియర్ ట్యూబర్క్యులోసిస్ ల్యాబొరేటరీ సూపర్వైజర్ ఒకటి ఖాళీ ఉందని తెలిపారు.
ఏదైనా డిగ్రీ ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా లేదా సమాన అర్హత చెల్లుబాటు అయ్యే టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కంప్యూటర్ ఆపరేషన్స్లో కనీసం రెండు నెలల సర్టిఫికేట్ కోర్సు ఉండాలని వివరించారు ఎన్‌టిఇపిలో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలని,18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయస్కులు అర్హులని తెలిపారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మాజీ సైనికులకు 3 సంవత్సరాలు ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్లకు 3 సంవత్సరాలు సేవా కాలం దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉందని తెలిపారు.
అభ్యర్థులు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధికారిక వ్బుసైట్ నుండి దరఖాస్తు ఫారమ్ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. medchal-malkajgiri. telangana.gov.in దరఖాస్తుల 03, 04,05 తేదీలలో జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి కార్యాలయం, 1వ అంతస్తు, DOC భవనం, అంతాయిపల్లి సమర్పించాలన్నారు.అభ్యర్థులు పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారమ్తో పాటు అవసరమైన ధృవపత్రాల జిరాక్స్ ప్రతులు మరియు రూ.500/- డిమాండ్ డ్రాఫ్ట్ సమర్పించాలని వివరించారు.






