3 June, 2026 | 1:09 AM

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

03-06-2026 12:34 AM

పాల్గొన్న ఎంపీ సురేష్ శెట్కార్ 

నారాయణఖేడ్, జూన్ 2: నారాయణఖేడ్ నియోజకవర్గం కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మంగళవారం ఘ నంగా జరిగాయి. ఇందులో భాగంగా స్థానిక  స్వతంత్ర సమరయోధుల చౌక్ వద్ద జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కార్ జాతీయ జెండా ను ఎగరవేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు, స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సబ్ కలెక్టర్ ఉమా హారతి జాతీయ జెండాను ఎగురవేశారు.

స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ చైర్మన్ నగేష్ షట్కార్ జాతీయ జెండాను ఎగురవేశారు. పలు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలల ఆవరణలో స్థానిక గ్రామపంచాయతీ కార్యాల యాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కా ర్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్య దర్శి చంద్రశేఖర్ రెడ్డి నాయకులు సుధాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, తయార్ అలీ, వినోద్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. కాగా స్థానిక బిఆర్‌ఎస్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జెండావిష్కరణ చేశారు.