కాంగ్రెస్ పార్టీలో చేరిన దేవుల నాయక్ తండా ఉప సర్పంచ్
26-07-2026 02:44 PM
బోథ్,(విజయక్రాంతి): సునాల మండలంలోని దేవుల నాయక్ తండ గ్రామ ఉపసర్పంచ్ జాదవ్ అరవింద్ తోపాటు వార్డు సభ్యులు కృష్ణ లు ఆదివారం మాజీ ఎంపీ సోయం బాబురావు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరుతున్నామన్నారు. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే సాధ్య మనీ గమనించమన్నారు. కార్యక్రమంలో సోనాల మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు వినోద్ సింగ్ చింతలపూడి సర్పంచ్ శ్రీరామ్ సహకార సంఘం డైరెక్టర్ లోలపు పోశెట్టి తదితరులు ఉన్నారు






