27 July, 2026 | 8:15 PM

ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం

27-07-2026 07:39 PM

నియామక పత్రం అందుకున్న మిడిదొడ్డి సంపత్ కుమార్

చుంచుపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్ నందు ఎస్సీ సెల్ జిల్లా,పట్టణ మరియు మండల కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మానకొండూరు శాసనసభ సభ్యులు కవంపల్లి సత్యనారాయణ, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి తోట దేవిప్రసన్న తో కలిసి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆళ్ల.మురళి గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారామ, జిల్లా కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ వై. శ్రీనివాస్ రెడ్డి ,కొత్వాలా శ్రీను, కార్పొరేటర్స్ జెల్లి. శ్రీలక్ష్మి, సుప్రియ, మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.