27 July, 2026 | 8:19 PM

మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు

27-07-2026 07:48 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఫీల్డ్ అసిస్టెంట్ల సమీక్ష సమావేశం బహిష్కరించుట గురించి మండలంలోని ఆయా గ్రామాల్లో చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఎంపీడీవో గంగాధర్కు వినతి పత్రాన్ని అందజేశారు.మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో విబి-జి రంజీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్నామని, అయితే గత రెండు నెలలుగా, ఈ నెలతో పాటు మూడు నెలలుగా  రావాల్సిన జీతభత్యాలు చెల్లించుటలేదు. పని భారం ఎక్కువగా అవుతుందని అయినా పనులు చేస్తున్నామని, విబి-జి రంజి సాధారణ పనులు చేస్తూనే ఇందిరమ్మ ఇండ్ల ఫోటో క్యాప్చర్ అటెండెన్స్, వన మహోత్సవంతో పాటు ప్రభుత్వం సూచించిన అన్ని రకాల పనులను సకాలంలో చేస్తున్నామని,

20 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ జీతాలు మాత్రం మొదటి వారంలో చెల్లించకపోవడంతో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని, కుటుంబ పోషణ భారం అవుతుందని తెలుపుతూ స్థానిక ఎంపీడీవో గంగాధర్కు ఫీల్డ్ అసిస్టెంట్లు వినతి పత్రం రూపంలో వారి సమస్యలను తెలియజేశారు.కావున ఈ విషయంలో విబి-జి,రంజి పనులు చేస్తూనే నేటి సమీక్ష సమావేశం బహిష్కరిస్తున్నామని వినతి పత్రంలో పేర్కొన్నారు.కావున ఇట్టి విషయం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళగలరని ఎంపీడీవో గంగాధర్ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్, ఏపీవో సక్కుబాయి, ఫీల్డ్ అసిస్టెంట్లు సంగయ్య, రాములు, అంజయ్య, నర్సింలు, అంజి, లింగగౌడ్, శ్రీనివాస్, మల్లవ్వ, తదితరులు పాల్గొన్నారు.