8 June, 2026 | 1:48 AM

బోయిన్‌పల్లిలో వెలిసిన విగ్రహాలు, భూ అక్రమణ కోసమేనా?

08-06-2026 12:00 AM

నిన్నటి వరకు ఇది రికార్డుల్లో ఖాళీ స్థలమే..

విగ్రహాల ప్రతిష్ట వెనక ఎవరి హస్తం ఉంది?

రాత్రికి రాత్రి అంజయ్యనగర్ పక్కన ఖాళీ స్థలంలో ఏసు ప్రభు సిలువ, బీరప్పలయ్య విగ్రహాలు

విగ్రహాలకు పోలీసులు బందోబస్తు...

సికింద్రాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): నిన్నటి వరకు ఇది రికార్డుల్లో ఖాళీ స్థలమే.. విగ్రహాల ప్రతిష్ట వెనక ఎవరి హస్తం ఉంది? అన్ని స్థానిక ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోయిన్‌పల్లి ఎన్‌ఎంహెచ్ ఎదురుగా అంజయ్య నగర్‌కు ఆనుకుని ఉన్న తోకట్ట సర్వే నెంబర్ 157/1, సీఎస్ 13  స్థలం నిన్నటి రాత్రి వరకు ఖాళీగా ఉంది.

ఈ స్థలంలో తెల్లారేసరికి ఏసుప్రభు సిలువ, బీరప్పలయ్య స్వామి విగ్రహాలును గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ నెలకొల్పడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అంజయ్య నగర్ పక్కన ఖాళీ స్థలంలో ఏసు ప్రభు సిలువ, బీరప్పలయ్య విగ్రహాలు నెలకొల్పారు.

నిన్నటి వరకు ఇది రికార్డుల్లో ఖాళీ స్థలమే. ఈ సర్వే నెంబర్ 157/1 లో ఎలాంటి మతపరమైన కట్టడాలకు అనుమతి ఇవ్వలేదు కొంతకాలంగా ఈ స్థలం వివాదాల్లో ఉన్నది. ఇటీవలే హైకోర్టు డిగ్రీ, కంటోన్మెంట్ బోర్డ్ అధికారుల పర్మిషన్లతో కాంపౌండ్ వాల్ నిర్మాణాల జరుగుతున్న తరుణంలో ఈ విధంగా రెండు వేర్వేరు మతాలకు సంబంధించిన విగ్రహాలు ఒకేసారి ప్రతిష్టించినట్లు తెలుస్తోంది. చట్టం ముందు అందరూ సమానం.

అనుమతి లేకుండా ఏ మతం కట్టడం కట్టినా అది అక్రమమే. అధికారులు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని.. ఏ మతమైనా, చట్టాన్ని గౌరవించాల్సిందే. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో అనుమతి లేకుండా నిర్మాణాలు జరపవద్దు. శాంతి భద్రతలుకు భంగం కలిగించే చర్యలు వద్దు. గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ ప్రతిష్టించినట్లు తెలుస్తోంది. ఒకే రాత్రి రెండు విగ్రహాలు ప్రత్యక్షం కావడం వెనుక ఉద్దేశం ఏంటి? స్థలం కబ్జానా? లేక మరేదైనా కారణమా? పోలీసులు, రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టాలి.

ఈ భూమి కొరకు స్థానికులు, నవాబు కుటుంబ సభ్యులు, రాజకీయ నేతలు, ఇతరులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి ఆందోళన కర పరిస్థితులు ఎదురు కాకుండా.. జరగకుండా ముందస్తు చర్యలు భాగంగా బందోబస్తు చేపట్టారు. ప్రజలు మాత్రం సంయమనం పాటించాలని, వదంతులు నమ్మవద్దని పోలీస్ అధికారులు కోరుతున్నారు. ఈ స్థలంలో ప్రతిష్టించిన విగ్రహాల ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.