ఒక్క ళ్లమేనా?
“ఎక్కడ ఉండేది? ”
“ఇక్కడే దగ్గర్లోనే, అరగంట దూరం”
“ఎవరైనా ఉన్నారా తెలిసిన వాళ్లు”
“ఎవరూ లేరు-.. మేమే ఒక్కళ్లమే”
దగ్గర్లో తెలిసిన వాళ్లు ఉన్నారని- కలుసుకున్నా, కలవకపోయినా, మాట్లాడినా, మాట్లాడకపోయినా, ఒంటరిగాలేమని అనేసుకుంటాం.
ఇన్ని కాలనీలు, ఇన్ని ఇళ్లు, ఇంత జనం మధ్య ఎవరు మనవాళ్లు కాలేని, మనవ ఎవరికీ కాలేని లోకాన్ని సృష్టించుకుని, ఆ ఇరికిరుకు పరిధిలోనే బతికేస్తుంటాం.
ఇంతమంది మధ్యలోనూ ఏకాకి తనంతో బిగుసుకుపోయి కిందా మీదా అయిపోతాం.
సమూహంలోనే అన్నట్టుగా, ఏదో తామూ అందరితోనే, అందరిలోనే ఉన్నట్టుగా తమకు తాము భావించుకొని, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని(the world) నమ్మిస్తూనే ఎవరికి వారే మానసిక, భౌతిక గిరి గీతలు గీసుకొని వేరువేరుగా, దూ రంగా, జీవనాన్ని గడుపుతూ అతి భారంగా మోస్తున్న ఏకాకితనాన్ని, కోల్పోతున్న అనుబంధాన్ని, మనిషితనాన్ని గుర్తుచేసిన యాకూబ్ కవిత ‘ఒక్కళ్ల మేనా?’. నిజానికి ఈ కవిత ఏ ఒక్కరి కోసమూ రాసింది కాదు.. అందరినీ ఆలోచింపజేసేందుకు కవిపరంగా జరిగిన సామాజిక ప్రయత్నం.
అరగంట ప్రయాణం చేసే దగ్గర్లోనే నివసిస్తున్నా కూ డా కలుసుకొని మాట్లాడుకునే తనాన్ని కోల్పో తూ ప్రతి ఒక్కరూ ఒక్కళ్లుగా ఒంటరితనాన్ని ఒం ట కట్టేసుకోవడం, వెంటేసుకోవడం బాధాకరమన్నారు. నివాస వ్యవస్థలైన ఎన్నో కాలనీల జన సమూహాల మధ్య ఎవరికీ ఎవరు ఏమీ కాలేని ఒంటరితనం అలుముకుని ఇరుకిరుకు పరిధుల్లో బతికేస్తూ ఎందుకు కింద మీద అయిపోతారంటూ వేదన చెందారు. ఇంతమంది మధ్య మిగిలిన ఏకాకితనం ఏ మనిషితనానికి ప్రతి బింబం, ప్రతిరూపమో చెప్పమని కవి నిలేశారు.
మానవానుబంధం కోల్పోతే మిగిలేది శిథిల నిశ్శబ్దం, ఒంటరితనపు శ్మశాన వైరాగ్యం అని చివరకు తేల్చి చెప్పారు. ‘నన్ను బతికించటానికి’ అన్న ఒక కవితలో కె శివారెడ్డి రాసిన ‘ఒక్క వాక్యం చాలు నన్ను సజీవుణ్ణి చేయటానికి/ సజీవుణ్ణి చేసి మళ్లా సమరానికి పంపటానికి’ అన్న కవితా వాక్యాలు యాకూబ్ కవితను నిశితంగా చదివితే గుర్తుకొస్తాయి. వందలాది యాకూబ్ కవితల్లో ఈ కవిత ప్రతి ఒక్కరి గుండెల్లోకి దూసుకెళ్లి ఆలోచనాత్మక చైతన్యాన్ని రగిలించే పోయెటిక్ మిస్సైల్.