పూడూరు మేడ్చల్‌లో అరైవ్, అలైవ్ రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు
మేడ్చల్ ట్రాఫిక్ సీఐ మధుసూదన్
మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 14(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పట్టణంతో పాటు పూడూరు మున్సిపల్ పట్టణాలలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్,అలైవ్ రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు ట్రాఫిక్ సిఐ మధుసూదన్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తూ స్థానిక ప్రజలకు వివరించినట్లు ఆయన చెప్పారు.
ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు పేద ధనిక తేడా లేకుండా అందరినీ దెబ్బతీస్తాయని ట్రాఫిక్ సిఐ వెల్లడించారు. అంతేకాకుండా తల్లిదండ్రులు మైనర్ లకు వాహనాలు ఇవ్వకూడదని మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి కుటుంబం క్షేమంగా ఉండాలన్నదే మా ఉద్దేశమని ట్రాఫిక్ సిఐ మధుసూదన్ స్పష్టం చేశారు.
హెల్మెంట్ ధరించడం తప్పనిసరి:మేడ్చల్ సిఐ అద్దాని సత్యనారాయణ
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెంట్ ధరించాలని సిఐ అద్దాని సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనం కలిగి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి తప్పనిసరిగా హెల్మెంట్ వాడాలని తెలిపారు.ఇటీవల మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణంలోని పారిశ్రామిక వాడ వద్ద జరిగిన ఒక రోడ్డు ప్రమాదం తనను తీవ్రంగా కలిసి వేసిందని సిఐ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ద్విచక్ర వాహనదారులే ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆయన చెప్పారు. ద్విచక్ర వాహనదారులు ట్రిపుల్ రైడింగ్ హెల్మెంట్ లేకపోవడం మరణాలకు ప్రధాన కారణాలు ఉన్నాయన్నారు. పోలీసుల చర్యల వల్ల ప్రమాదాల రేటు తగ్గుతుందని ప్రమాదం జరిగిన గోల్డెన్ అవర్ లో బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారికి ప్రభుత్వం 25వేల రూపాయల నగదు బహుమతి ఇస్తుందని సీఐ వెల్లడించారు.
అనంతరం మేడ్చల్ మున్సిపల్ సర్కిల్ పట్టణంలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మేడ్చల్ ట్రాఫిక్ సిఐ మధుసూదన్ ఆధ్వర్యంలో అరైవ్,అలైవ్ రోడ్డు భద్రత ప్రమాదాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్. మున్సిపల్ మాజీ కో-ఆప్షన్ సభ్యులు అకీటి నవీన్ రెడ్డి.విష్ణు చారి.నడికోప్పు నాగరాజు శైలేందర్.సంజీవరావు రాజు లతో పాటు మాజీ సర్పంచ్ ఇటబోయిన బాబు యాదవ్. మాజీ ఎంపీటీసీ సింగరేణి పోచయ్య.మాజీ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి.మాజీ వార్డు సభ్యులు కోల వెంకటేష్.శేఖర్ రెడ్డి.యాటవల్లి హనుమంత్ రెడ్డి.తుపాకుల కృష్ణ.జనార్ధన్ యాదవ్ ట్రాఫిక్ ఎస్‌ఐ పరశురాం లతో పాటు విద్యార్థిని విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు..






