27 June, 2026 | 12:18 PM

ములుగు జిల్లాలో విషాదం

27-06-2026 11:16 AM

పిడుగుపాటుకు 21 పశువుల దుర్మరణం 

ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu district) తాడ్వాయి మండలం అంకంపల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి పిడుగు పడి మంకిడి సమ్మయ్య అనే రైతుకు చెందిన 21 పశువులు దుర్మరణం పాలయ్యాయి. పశువులను వ్యవసాయ క్షేత్రం వద్ద కట్టి వేయగా పిడుగుపాటుకు చనిపోయాయి. ఈ సంఘటనతో ఆ రైతు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. ఈ సంఘటన నేపథ్యంలో తాడ్వాయి వెటర్నరీ అసిస్టెంట్ రాజు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించాడు.