15 April, 2026 | 3:16 AM

సమానత్వం కోసం జార్జిరెడ్డి చేసిన పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం

15-04-2026 12:59 AM

ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల, ఏప్రిల్ 14: నకిరేకల్ పట్టణంలో పిడిఎస్యూ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జార్జి రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకేరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం పాల్గొని నివాళులు అర్పించారు. మంగళవారం  జార్జిరెడ్డి వర్ధంతి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్ నందు ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే  పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, జార్జిరెడ్డి  త్యాగం, సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, పిడిఎస్యు పూర్వ విద్యార్థుల నాయకులు  తదితరులు  పాల్గొన్నారు.