బెజ్జూర్ మండల రోడ్లను పట్టించుకోరా?
ఎమ్మెల్యే హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విట్టల్ తీరుపై ఆర్షద్ హుస్సేన్ ఆగ్రహం
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల పరిధిలోని రహదారుల దుస్థితిపై ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ మైనార్టీ చైర్మన్ ఆర్షద్ హుస్సేన్ మండిపడ్డారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విట్టల్ స్థానిక రోడ్ల సమస్యలను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బ్రిడ్జిల నిర్మాణం: కృష్ణపల్లి నుండి సోమిని వెళ్లే మార్గంలో రెండు కీలకమైన బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదు అని అన్నారు.
రహదారుల పునరుద్ధరణ: సులుగుపల్లి నుండి పెంచికలపేట వైపు వెళ్లే రహదారులు అధ్వానంగా తయారై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. "బెజ్జూర్ మండల ప్రజలు కూడా మనుషులే అన్న విషయాన్ని ప్రజాప్రతినిధులు గుర్తుంచుకోవాలి. తక్షణమే స్పందించి అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.






