30 April, 2026 | 4:05 AM

ఎండలు పెరిగితే కిడ్నీలకే మొదటి దెబ్బ!

30-04-2026 02:46 AM
  1. కిడ్నీ రాళ్లు, మూత్ర ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి
  2. కేర్ హాస్పిటల్స్ వైద్యులు

హైదరాబాద్ , ఏప్రిల్ 29(విజయక్రాంతి): వేసవి కా లం అంటే చాలామందికి గుర్తొచ్చేది దాహం, అలసట, వడదెబ్బ. కానీ ఎండల తీవ్రత వల్ల మౌనంగా దెబ్బతినే అవయవాల్లో కిడ్నీలు కూడా ముందుంటాయని వైద్యు లు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఏడాది ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ కిడ్నీరాళ్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, మూత్రంలో మంట, మూత్రం తగ్గిపోవడం, నడుము-ప్రక్క భాగంలో తీవ్రమైన నొప్పి వంటి సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని యూరాలజిస్టులు చెబుతు న్నారు.

కేర్ హాస్పిటల్స్ వైద్యులు చెబుతున్నదేమంటే, వేసవిలో చెమట రూపం లో శరీరం అధికంగా నీటిని కోల్పోతుంది. అదే సమయంలో తగినంత నీరు తాగ కపోతే శరీరంలో నీటి శాతం తగ్గిపోవడంతో మూత్రం సాంద్రత పెరుగుతుంది. ఈ పరిస్థితిలో మూత్రంలో ఉం డే కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖ నిజాలు స్ఫటికాలుగా మారి క్రమంగా కిడ్నీ రాళ్లుగా రూపాంతరం చెందుతాయి.‘వేసవి ప్రారంభమైన తర్వాత యూరాలజీ కేసుల్లో పెరు గుదల చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా మంది ఇది ఒక్కరోజులో వచ్చే సమస్య అనుకుంటారు. 

వైద్యుల ప్రకారం, దాహం వేయడం అంటే శరీరం అప్పటికే డీహైడ్రేషన్‌లోకి వెళ్లిందనే సంకేతం. హైడ్రేషన్‌కు అసలు ప్రత్యామ్నాయం నీళ్లే. కేఫిన్, అధిక చక్కెర ఉన్న పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ మరింత పెరగవచ్చు. పైగా అవి కొన్ని సందర్భాల్లో స్టోన్ ఫార్మేషన్‌కు దారితీసే మెటబాలిక్ మార్పులను కూడా ప్రోత్సహిస్తాయని డాక్టర్ నవీన్ కుమార్ స్పష్టం చేశారు.