అరవింద్ అంటేనే హాఫ్ నాలెడ్జి

28-09-2026 | 09:21pm
  • - కేసీఆర్ ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకొము

- బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి 

నిజామాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్(MP Dharmapuri Arvind) అంటేనే హాఫ్ నాలెడ్జి గాడని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి(Former MLA Asannagari Jeevan Reddy) ధ్వజమెత్తారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్(BRS) జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అహంకారం, అవినీతి, అబద్దానికి ఆంగి లాగు తొడిగితే అది అరవింద్ అసలు రూపమని ఎద్దేవా చేశారు. అయ్యపేరు చెప్పుకుని 2004 లో కాంగ్రెస్(Congress) బీ ఫామ్ లు అమ్ము కున్న అవినీతి బాగోతాలు అరవింద్ మూటగట్టు కున్నాడని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని పగలు పొట్టోడు అని తిడతాడు, రాత్రి పోయి పొర్లు దండలు పెడతడు అని ఆయన వ్యాఖ్యానించారు.

అరవింద్ ఎంపీగా గెలవడం నిజామాబాద్ జిల్లా(Nizamabad District) దురదృష్టమన్నారు. బనకచర్లను జనకచర్ల అనే అరజ్ఞాని అరవింద్ అని, నిజామాబాద్ కు నయాపైసా తేలేని చేతకాని దద్దమ్మ అని, అలాంటి చవట సన్నాసి అరవింద్ కు రాష్ట్రం తెచ్చిన కేసీఆర్(KCR) గురించి మాట్లాడే స్థాయి ఉందా? అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రేవంత్ పేటీఎం బ్యాచ్ సభ్యుడు అరవింద్ అని, కాంగ్రెస్ తో పోరాడే శక్తి లేక కేసీఆర్ ను తిడుతుండు అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం(Telangana Movement)లో అరవింద్ పాత్ర అణా పైసా కూడా  లేదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పై ఇంకెంత కాలం విషం కక్కుతారని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలకు, రోత మాటలకు  అరవింద్ అడ్డాగా మారిండని ఆయన విమర్శించారు. అరవింద్ ఇల్లు, అతడి కుటుంబమే అవినీతి, అబద్దాల పునాదులపై పుట్టిందన్నారు. అరవింద్ ఒక చార్లెస్ శోభరాజ్ అయితే, నీ పార్టీకి చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఒక దావూద్ ఇబ్రహీం అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.అరవింద్  ఒక డ్రగ్స్ స్మగ్లర్ అని, రాకేష్ రెడ్డి ఒక ఎర్ర చందనం, దొంగ బంగారం స్మగ్లర్ అని ఆయన ఎద్దేవా చేశారు.

అరవింద్ కాదు రాబంధు అని, అతడి ఇంటి పేరు ధర్మపురి కాదు, ధర్మానికి ఉరి అని, అధర్మానికి పుట్టిన అడ్డగాడిదని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. పసుపు బోర్డు  ఎక్కడుందో అరవింద్ చెప్పాలి.  తెలంగాణ ఉద్యమంలో అరవింద్ కుటుంబం ఎక్కడుందని ప్రశ్నించారు. కేసీఆర్ భూములపై సీఎం రేవంత్ రెడ్డి ఏ అబద్ధాలు చెప్పిండో అవే అబద్ధాలు అరవింద్ కూడా చెప్పిండన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, అరగుండు అరవింద్ లు తెలంగాణ వాదులు కాదని, తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అంటు వ్యాధులని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ జోలికొస్తే నాలుక చీరేస్తామని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

బట్టేబాజ్ మాటలు చెప్పి బాండ్ పేపర్ రాసిచ్చి రెండు సార్లు ఓట్లు వేయించుకున్న ఎంపీ అరవిందు పసుపు రైతుల బాధలు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. పసుపు పంటకు మద్దతు ధరలు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఎందుకు రైతులకు అండగా నిలవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పి ఛైర్మన్ విఠల్ రావు, సత్యప్రకాష్, లక్ష్మారెడ్డి, కౌన్సిలర్లు నదీమ్,పృథ్వి, అజీమ్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు గంగాధర్, రంజిత్, అభిలాష్, మల్లారెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు