రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు ఆశ్రమ పాఠశాల విద్యార్థి ఎంపిక

01-10-2026 | 06:49pm

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వేములవాడలో అక్టోబర్ 2 నుంచి 5 వరకు జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర కబడ్డీ పోటీలకు(State level junior boys kabaddi competitions) ఆసిఫాబాద్ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి కొట్నాక రోషన్(Student Kotnaka Roshan) ఎంపికయ్యాడు. పదో తరగతి చదువుతున్న రోషన్ జిల్లా జట్టు తరఫున రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు.ఈ సందర్భంగా ఉట్నూర్ ఐటీడీఏ పీవో మందా మకరంద్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ జాదవ్ అంబాజీ రోషన్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏసీఎం ఉద్దవ్, జీసీడీవో కె.శకుంతల, గిరిజన క్రీడల అధికారి మడావి షేకు, ఏటీడీవో చిరంజీవి, హెచ్‌డబ్ల్యూఓ మధుకర్, ఖేలో ఇండియా కోచ్ కడతాల రాకేష్, కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ఆత్రం ధర్మారావు, ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, వ్యాయామ ఉపాధ్యాయుడు అరవింద్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు