పంటలకు మేలంట.. నీటి కుంట..
- బోరు బావులపై భారాన్ని తగ్గించొచ్చు
- ఉద్యానశాఖ ప్రోత్సాహం
- తవ్వకానికి ఇదే సరైన సమయం
- 12 లక్షల లీటర్ల నిల్వ.. 20 మీటర్ల వెడల్పు
- 20 మీటర్ల పొడవు.. 3 మీటర్ల లోతుతో నీటి కుంట
- నిర్మించుకుంటే సుమారు 12 లక్షల లీటర్ల నీరు నిల్వ చేసుకోవచ్చు
బోధన్, జున్ 2 (విజయక్రాంతి): 12 లక్షల లీటర్ల నిల్వ.. 20 మీటర్ల వెడల్పు.. 20 మీటర్ల పొడవు.. 3 మీటర్ల లోతుతో నీటి కుంట నిర్మించుకుంటే సుమారు 12 లక్షల లీటర్ల నీరు నిల్వ చేసుకోవచ్చు. ఇందుకు ఉద్యానశాఖ 50 శాతం రాయితీ ఇస్తోంది. కష్టకాలంలో బిందు సేద్యం ద్వారా పంటలకు నీటి తడులు అందించొచ్చు. తద్వారా దిగుబడులు పెంచుకోవచ్చు. బోరు బావులపై భారాన్ని తగ్గించొచ్చు. సిల్పాలిన్ షీట్తో కుంటకు లైనింగ్ చేసుకోవడం ద్వారా నీటి లీకేజీని అరికట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేసుకోవచ్చు.
12 లక్షల లీటర్ల నిల్వ.. 20 మీటర్ల వెడల్పు.. 20 మీటర్ల పొడవు.. 3 మీటర్ల లోతుతో నీటి కుంట నిర్మించుకుంటే సుమారు 12 లక్షల లీటర్ల నీరు నిల్వ చేసుకోవచ్చు. ఇందుకు ఉద్యానశాఖ 50 శాతం రాయితీ ఇస్తోంది. కష్టకాలంలో బిందు సేద్యం ద్వారా పంటలకు నీటి తడులు అందించొచ్చు. తద్వారా దిగుబడులు పెంచుకోవచ్చు. బోరు బావులపై భారాన్ని తగ్గించొచ్చు. సిల్పాలిన్ షీట్తో కుంటకు లైనింగ్ చేసుకోవడం ద్వారా నీటి లీకేజీని అరికట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేసుకోవచ్చు.
12 లక్షల లీటర్ల నిల్వ.. 20 మీటర్ల వెడల్పు.. 20 మీటర్ల పొడవు.. 3 మీటర్ల లోతుతో నీటి కుంట నిర్మించుకుంటే సుమారు 12 లక్షల లీటర్ల నీరు నిల్వ చేసుకోవచ్చు. ఇందుకు ఉద్యానశాఖ 50 శాతం రాయితీ ఇస్తోంది. కష్టకాలంలో బిందు సేద్యం ద్వారా పంటలకు నీటి తడులు అందించొచ్చు. తద్వారా దిగుబడులు పెంచుకోవచ్చు. బోరు బావులపై భారాన్ని తగ్గించొచ్చు. సిల్పాలిన్ షీట్తో కుంటకు లైనింగ్ చేసుకోవడం ద్వారా నీటి లీకేజీని అరికట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేసుకోవచ్చు.
ఖరీఫ్ పంటల సాగుకు ఇంకా సమయం ఉన్నందున రైతులు వెంటనే నీటి కుంటలు తవ్వుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాధారంగా పంటలు పండించే మెట్ట ప్రాంతాల్లో ఇవి కీలకంగా ఉంటాయని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మిరప, పసుపు ఇలా... దీర్ఘకాలం సాగులో ఉండే ఈ పంటలకు నీటి తడులు తరచూ అందించాల్సి ఉంటుంది. చాలాచోట్ల నీటి వనరులు అందుబాటులో లేని కారణంగా కొంతమంది రైతులు ఉద్యాన పంటల సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటివారికి తక్షణ ఉపాయంగా నీటి కుంటలను సూచిస్తోంది ఉద్యానశాఖ.
ఎల్నినో నేపథ్యంలో..
ఎందుకంటే... నిర్దేశిత పరిమాణంలో నీటి కుంటలను తవ్వుకోవడం వల్ల సాగునీటి ఇబ్బందులుండవు. ప్రస్తుతం పొలాలు ఖాళీగా ఉన్నందున రైతులు దృష్టి సారించొచ్చు. కుంటల పరిమాణం ఆధారంగా రాయితీలు వినియోగించుకోవచ్చు. మిర్చి సాగులో కీలక దశలో ఒక్క తడి అందించకపోయినా దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు కిలోమీటర్ల దూరం నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకున్న ఘటనలెన్నో ఉన్నాయి. బోధన్ మండలంలోని పెగడపల్లి, భూలక్ష్మి క్యాంప్, బర్దిపూర్, సాలంపాడు సాలుర మండలాల్లో ఈ గుంటలో నిర్మిస్తున్నారు.
ప్రాంతాల్లో అప్పటికప్పుడు నీటి కుంటలు తవ్విన పరిస్థితులూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వేసవిలోనే నీటి కుంటలు తవ్వుకుంటే కాస్త వర్షం కురిసినా.. నీటిని ఒడిసిపట్టి నిల్వ చేసుకోవచ్చు. వర్షాలు కాస్త ఆలస్యమైనా.. కాలువలకు నీటి విడుదలలో జాప్యం జరిగినా.. ఇవి ఉపయోగపడతాయి. పంట కుంటల వల్ల పొలంలో 5 సెంట్ల వరకు సాగుకు ఉపయోగపడదన్న అపోహలో కొంతమంది రైతులున్నారు. వాటి ఆవశ్యకతను గుర్తించాలని జలవనరుల నిపుణులు సూచిస్తున్నారు.






