290 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
ఆర్‌అండ్‌బీ, పీసీబీలో ఇంజినీర్ పోస్టుల భర్తీకి..
వేర్వేరుగా 3 నోటిఫికేషన్లు జారీ
టీజీపీఎస్‌సీ వెబ్‌సెట్‌లో వివరాలు
హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వివిధ శాఖల్లో 290 పోస్టుల భర్తీకి గాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్‌సీ) 3 నోటిఫికేషన్లు జారీ చేసింది. రోడ్లు భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ)లో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజినీర్లు, 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూ టివ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ)లో 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది.

దరఖాస్తుల స్వీకరణ ఇలా..
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజినీర్ పోస్టులకు ఈనెల 6 నుంచి జూలై 13వ తేదీ వర కు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ పోస్టులకు ఈనెల 8 నుంచి జూలై 15వ తేదీ వరకు, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులకు ఈనెల 10 నుంచి జూలై 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
అభ్యర్థుల వయో పరిమితిని 18 నుంచి 44 ఏళ్లుగా నిర్ణయించారు. గరిష్ట వయోపరిమితిలో సడలిం పులు కూడా వర్తించనున్నాయి. పూర్తి వివరాలకు తమ అధికారిక వెబ్‌సైట్‌ను సంద ర్శించవచ్చని టీజీపీఎస్‌సీ అధికారులు పేర్కొన్నారు.






