పారమిత ఉపాధ్యాయుల సమ్మేళనం

13-09-2026 | 12:46am

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని రేకుర్తి  శుభం కన్వెన్షన్ లో ఏకత్వ అనే పేరుతో పారమిత ఉపాధ్యాయుల సమ్మేళనం(Association of Paramitha Teachers) నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో పారమిత ఉపాధ్యాయులు నృత్యాలు, నాటకాలు, పాటలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు(Cultural programs)  నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పారమిత పాఠశాల యాజమాన్యం  ఉపాధ్యాయుల మధ్య ఆహ్లాదకరమైన, స్నేహపూర్వక వాతావరణంలో  కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సంధర్భంగా పారమిత విధ్యాసంస్థల అధినేత డా: ఇనుగంటి ప్రసాదరావు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఇలాగే ప్రతి రోజు ఉపాద్యాయులు ఆనందంగా ఉత్సాహంగా ఉంటూ సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో   ఉపాధ్యాయులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం మంత్ర ముగ్ధు లను చేశాయి. ఈ సంధర్భంగా పాఠశాల యాజమాన్యం ఉపాద్యాయులకు    ఇచ్చిన   గౌరవానికి   ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పారమిత విధ్యాసంస్థల డైరెక్టర్స్ ప్రసూన, రశ్మిత,అనుకర్ రావు, వినోద్ రావు, రాకేశ్, ప్రాచి, వి.యు.యం.ప్రసాద్, హనుమంత రావు, ప్రధానోపాధ్యాయులు శ్రీకర్, ప్రశాంత్, బాలాజీ, గోపికృష్ణ, కవిత, శర్మిష్ఠ, సమన్వయకర్తలు  మరియు ఉపాద్యాయులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు