15 June, 2026 | 3:37 AM

ఆసీస్‌కు తప్పిన పరాభవం

15-06-2026 01:35 AM

చివరి వన్డేలో 1 వికెట్‌తో గెలుపు

కన్నోలీ సెంచరీతో గట్టెక్కిన కంగారూలు

ఢాకా, జూన్ 14: ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా తృటిలో ఘోరపరాభవాన్ని తప్పించుకుంది. బంగ్లాదేశ్‌తో ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన కంగారూలు చివరి వన్డేలో అతికష్టం మీద 1 వికెట్ తేడాతో గట్టెక్కా రు. తద్వారా క్లీన్‌స్వీప్ పరాభవాన్ని తప్పించుకున్నారు.

మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదోయ్(83), లిటన్ దాస్ (58 నాటౌట్), మొసద్దెక్ హొసేన్(56 నాటౌట్) అర్దసెంచరీలతో రాణించడంతో 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో బార్ట్లెట్, రెన్షా తలో 2 వికెట్లతో రాణించారు.275 ప రుగుల లక్ష్య ఛేదనలో త్వరగానే 3 వికెట్లు కోల్పోయినా కూపర్ కన్నోల్లీ (149) సూపర్ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ ఓ దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది.

అతడికి లబూషేన్ (29), గ్రీన్ (27), పీక్ (27) కాసేపు అండగా నిలబడ్డారు. అయితే గెలుపుకు అతి చేరువలో 5 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోవడంతో ఆసీస్ ఓటమి దిశ గా సాగింది.  గెలుపు ఖరారయ్యాక బంగ్లా బౌలర్లు ఒక్కసారిగా చెలరేగడంతో ఆసీస్ బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యారు. షోరిఫుల్ ఇస్లాం (6/48)  అద్భుతంగా బౌలింగ్ చేసి ఆసీస్‌ను కంగారెత్తించాడు. చివరికి నానా కష్టాలు పడ్డ అనంతరం చివరి ఓవర్ మూ డో బంతికి ఆడమ్ జంపా (4 నాటౌట్) బౌండరీ సాధించి గట్టెక్కించాడు.