15 June, 2026 | 3:37 AM

ధీరజ్ గోల్డెన్ డబుల్ ధమాకా

15-06-2026 01:37 AM

చరిత్ర సృష్టించిన భారత ఆర్చర్

వ్యక్తిగత, మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణాలు

ఫైనల్లో కొరియా ఆర్చర్లపై గెలుపు

అంటాల్య, జూన్ 14: భారత స్టార్ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర చరిత్ర సృష్టించాడు. ఒకేరోజు రెండు స్వర్ణాలు సాధించి అరుదైన రికార్డు అందుకున్నాడు. తుర్కియాలోని అం టాల్య వేదికగా జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ భారత్ క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ధీరజ్ బొమ్మదేవర అటు వ్యక్తిగత విభాగంలోనూ, ఇటు మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ బంగారు పతకాలు కైవసం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనతో ఆర్చరీలో తమకు తిరుగులేదంటూ విర్రవీగే దక్షి ణ కొరియాకు భారత్ దిమ్మతిరిగే షాకిచ్చినట్టయింది.

మొదట మిక్సిడ్ టీమ్ విభాగం లో దక్షిణ కొరియాను నిలువరించిన భారత జోడీ ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ మొహు ద్ జోడీ విజేతగా నిలిచింది. అద్భుత ప్రదర్శ న కనబరిచి 5- స్కోరుతో బంగారు పత కాన్ని కైవసం చేసుకుంది.  ఊహించని విధం గా ఫైనల్స్‌లో భారత జంట చెలరేగిపోయిం ది. తొలి రెండు రౌండ్లలో ఆధిపత్యం కనబరిచింది. ఇక మూడో రౌండ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగింది. దీంతో స్కోరు 39- తో సమమైంది.

తొలి రెండు రౌండ్లలో సా ధించిన ఆధిక్యంతో భారత్ విజేతగా నిలిచింది. ధీరజ్-కుంకుమ్ జోడీకి ఇదే తొలి ప్ర పంచకప్ గోల్ మెడల్. అలాగే భారత్ వ రల్డ్‌కప్ స్టేజ్‌లో స్వర్ణం గెలుచుకోవడం నా లు గేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2022 ఈవెం ట్‌లో రిధి ఫోర్, తరుణ్ దీప్ రాయ్ జోడీ బంగారు పతకం సాధించింది. తర్వాత వ్యక్తిగత విభాగంలోనూ ఫైనల్‌కు చేరిన ధీరజ్ తన కంటే మెరుగైన ర్యాంకర్, కొరియాకు చెందిన లీపై విజయం సాధించాడు. ఆసక్తికరంగా సాగిన ఫైనల్స్‌లో 7 స్కోరుతో కొ రియా ఆర్చర్‌కు షాకిచ్చాడు. దీంతో ఒకే అం తర్జాతీయ వేదికపై రెండు స్వర్ణాలను సాధిం చి చరిత్ర సృష్టించాడు.