03-02-2026 12:56:17 AM
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 2 (విజ యక్రాంతి): రాయదుర్గం నాలెడ్జ్ సిటీ సమీపంలో ఆదివారం అర్ధరా త్రి సమయంలో ఓ ఆటో డ్రైవర్ ఓవర్ స్పీడ్‌తో వెళ్లుతూ వెనుక చక్రాలను లేపి ప్రమాదకరంగా స్టంట్లు చేయడం కలకలం రేపింది. రద్దీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో అక్కడున్న వాహనదారులు, పాదచారులు ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న రాయదుర్గం పెట్రోలింగ్ పోలీసులు ఆటోను ఆపేందుకు ప్రయత్నించగా డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు వెంబడించినప్పటికీ అతడు తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ స్పందించింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు వెల్లడిస్తూ, ప్రమాదకర స్టంట్లకు పాల్పడిన ఆటో డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.