calender_icon.png 3 February, 2026 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై దృష్టి పెట్టండి

03-02-2026 12:56:02 AM

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, ఫిబ్రవరి ౨ (విజయక్రాంతి): త్వరలో జరగబోయే గోదావరి పుష్కరాలకు కావలసిన ఏర్పాట్లను ఇప్పటినుండి ప్రారంభిం చాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో గోదావరి పుష్కర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో బాసర, సోను కూచంపల్లి పొనకల్ కానాపూర్ దిమ్మదుర్తి తదితర ప్రాంతాల్లో పుష్కర ఘాట్ ల వద్ద ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

పుష్కర ఘాట్లు తాగునీటి సౌకర్యం విద్యుత్ బల్బులు మరమ్మతులు బోటింగ్ విధానం ట్రాఫిక్ సమస్య తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అన్ని శాఖల సమావేశం తో పనులు నిర్వాహనకు ప్రతిపాదనలు పంపి మంజూరు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ బైంసా సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్ వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

కౌంటింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు 

జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల పరిశీలించి కౌంటింగ్ కేంద్రాల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు అడిగి తెలుసుకున్నారు.