రచయిత్రి స్వర్ణకిలారికి పురస్కారం
20-07-2026 12:00 AM
గుంటూరు జిల్లా రచయితల సంఘం యేటా ప్రతిష్ఠాత్మకంగా కవులు, రచయితలకు పురస్కారాలు ప్రదానం చేస్తున్నది. దీనిలో భాగంగానే ఈ ఏడాది కూడా పురస్కారాలు అందుకోనున్న కవి, రచయితలను ఎంపిక చేసింది. పురస్కారాల ఎంపికకు మొత్తం ౨౦ కథా సంపుటాలు, ౩౩ కవితా సంపుటాలు అందాయని సంఘం అధ్యక్షురాలు భవానీదేవి, ఎస్‌ఎం సుభాని తెలిపారు.
కాగా, వాటిలో స్వర్ణ కిలారి ‘గోడవతల’ కథా సంపుటి, విజయ్ కోగంటి ‘ఎవరిదీ చూపు’ కవితాల సంకలనం పురస్కారాలకు ఎంపికయ్యాయని ప్రకటిం చారు. ఎంపికైన రచయిత్రి స్వర్ణ, కవి విజయ్‌కి త్వరలో ఏపీలోని గుంటూరు జిల్లాకేంద్రంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పురస్కారాలు ప్రదానం చేస్తామని వెల్లడించారు.






