ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి
20-07-2026 05:16 PM
సుల్తానాబాద్,(విజయ క్రాంతి): పుట్టినరోజు అంటే హంగులు ఆడంబరాలు చేయకండి, ఆకలితో ఉన్నవారికి ఒక పూట భోజనం పెట్టండి అని యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల పునర్వాస కేంద్రంలో సుల్తానాబాద్ పట్టణానికి చెందిన కామ స్రవంతి- కుమారస్వామి ల చిన్న కుమారుడు సాయి దత్త పుట్టినరోజు సందర్భంగా వారి మామ యువ సంకల్ప ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమం ఇన్చార్జి దేశెట్టి రమేష్ పట్టణంలోని మానసిక వికలాంగుల పునర్వాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది, ఈ కార్యక్రమంలో సన్వీష్ , సెంట్రల్ ఇంచార్జ్ శ్రీనివాస్, సరస్వతి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.






