మహిళలు, బాలికల భద్రతపై అవగాహన సదస్సు
12-09-2026 | 07:23pm
జనగామ,(విజయక్రాంతి): జనగామ పట్టణంలోని ఎస్.సి. హాస్టల్‌లో షీ టీమ్(She Team) ఆధ్వర్యంలో మహిళలు, బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై లలిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో POCSO Act, మహిళా రక్షణ చట్టాలు, సైబర్ నేరాలు(Cybercrimes), T-Safe యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత వివరాలు, OTPలు అపరిచితులతో పంచుకోవద్దని, ఏవైనా వేధింపులు ఎదురైతే వెంటనే 100 / షీ టీమ్‌ను సంప్రదించాలని సూచించారు.