12 April, 2026 | 2:20 AM

ఫైనల్లో ఆయుష్ శెట్టి

12-04-2026 12:36 AM

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్

చైనా, ఏప్రిల్ 10 ః భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి సంచలనం సృష్టించాడు.  చైనాలోని నింగ్బో వేదికగా జరుగుతోన్న ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు.  సెమీస్‌లో  నెంబర్ వన్ ప్లేయర్  కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్)ను ఓడించాడు. తొలి సెట్ కోల్పోయి వెనుకబడినా పట్టువదలకుండా పోరాడి విజేతగా నిలిచాడు. హోరాహోరీగా సాగిన పోరులో 10--21, 21--19, 21--17 తేడాతో ఆయుష్ విజయం సాధించాడు.

నిజానికి తొలి గేమ్ కోల్పోయిన తర్వాత పుంజుకోవడం అంత సులభం కాదు. అలాంటిది ఈ టోర్నీ ఆరంభం నుంచీ అద్భుతంగా రాణిస్తున్న ఆయుష్ పట్టు వదల్లేదు. మిగిలిన రెండు సెట్లలో కూడా గట్టిపోటీ ఎదురైనప్పటకీ ఒత్తిడిని అధగమించి విజేతగా నిలిచాడు.

ఈ క్రమంలో ఆయుష్ ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఆసియా ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరిన రెండో భారత షట్లర్‌గా నిలిచాడు. 1965లో దినేశ్ ఖన్నా మొదటిసారి భారత్ తరఫున ఫైనల్‌కు చేరారు. ఒకవేళ ఫైనల్లోనూ గెలిచి స్వర్ణం సాధిస్తే మాత్రం తొలి భారత షటర్‌గా రికార్డు సృష్టిస్తాడు.