28 March, 2026 | 6:35 PM

Breaking News

మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు

28-03-2026 04:37 PM

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): శనివారం నాడు ఎర్రుపాలెం మండలం మామునూరు పేట చెరువు వద్ద తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేత మంజూరీ చేయించిన 4-86 కోట్ల రూపాయల పనులను గ్రామ సర్పంచ్ షేక్ పెద్ద బాబు సాహెబ్ తో కలిసి పనులను పరిశీలించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు.

 అనంతరం అక్కడే ఉన్న టూరిజం ఏఈ నరేష్ ను వివరాలు అడిగి తెలుసుకొని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. వీరి వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీపురం సర్పంచ్ తల్లపురెడ్డి నాగిరెడ్డి, బుచ్చిరెడ్డిపాలెం మాజీ సర్పంచ్ యరమల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు అనుమోలు వెంకటకృష్ణారావు, పాశం రవి, మారబత్తుల స్వామి,జంగా శేసిరెడ్డి,గుజ్జుల వెంకట్రామిరెడ్డి తదితరులు ఉన్నారు.