28 March, 2026 | 6:43 PM

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత

28-03-2026 04:33 PM

అడ్డాకుల: మండల కేంద్రంలో పరిధిలో కందూర్, గౌరీదేవుని పల్లి, వర్ని, అడ్డాకులమండల కేంద్రంలో గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వారి సతీమణి కవిత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో నిరుపేదలకు సొంత ఇంటి కల సహకారం చేయటానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిందన్నారు. గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ లు ఇస్తామని చెప్పడంతో నిరుపేదలు తమ పాత ఇండ్లను కూల్చి వేసుకున్నారు.

ఆశతో నిరుపేదలు  ఎదురు చూస్తే  డబల్ బెడ్ రూమ్ రాక నిరాశ చెందారు. తప్ప ఒక్క ఇల్లు కూడా కట్టించలేని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మహిళలకు ఉచిత ప్రయాణం, పావుల వడ్డీ రుణాలు, మహిళలకు  మొదటి విడతలో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలను పూర్తి చేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల రూపాయలు సద్వినియోగం చేసుకున్నారు. దేవరకద్ర నియోజకవర్గం నిరుపేదలకు మధుసూదన్ రెడ్డి నిరంతరం కృషి  చేస్తుందన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తోట శ్రీహరి, అడ్డాకుల సర్పంచ్ దశరథ రెడ్డి, నాగిరెడ్డి, విజయ్ మోహన్ రెడ్డి, కా రెడ్డి దేవేందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, వేగానాథ్ శకుంతల, రాములు, తదురులు పాల్గొన్నారు