బ్యాంకుల సమ్మె వాయిదా

28-09-2026 | 05:05am
  1. ఐబీఏ, యూఎఫ్‌బీయూ మధ్య చర్చలు సఫలం
  2. శనివారం సెలవుపై కమిటీ ఏర్పాటు
  3. మరిన్ని డిమాండ్లు, అభ్యంతరాలపై చర్చ, ప్రభుత్వానికి నివేదిక

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: బ్యాంకుల సమ్మె వాయిదా పడింది. ఆదివారం ఐబీఏ (ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్)(Indian Banks' Association) యూఎఫ్‌బీయూ (యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్)(United Forum of Bank Unions) మధ్య రాత్రి వరకు సమావేశం కొనసాగింది. ఇరుపక్షాలు కొన్ని నిర్ణయాలపై ఏకాభిప్రాయానికి రావడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యూఎఫ్‌బీయూ ప్రకటించింది. సమావేశంలో శనివారం సెలవురోజు ఇవ్వాలనే డిమాండ్‌పై ఐబీఏ, యూఎఫ్‌బీయూలతో కూడిన ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

బ్యాంకు ఉద్యోగులు, వినియోగదారులకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని ఈ కమిటీ సూచిస్తుంది. కమిటీ నివేదిక మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ లోగా యూనియన్లు, సంఘాల నుంచి వచ్చిన అన్ని అభ్యంతరాలు, డిమాండ్లపై ఐబీఏతో చర్చలు నిర్వహిస్తారు. చర్చల్లోని మార్పుల సారాంశాన్ని నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తారు. ఇరుపక్షాల మధ్య సమావేశంలో ఏకాభిప్రాయం కుదరడంతో 28, 29, 30న జరగాల్సిన మూడురోజుల సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు